కాంట్రాక్టర్‌ను హతమార్చిన మావోయిస్టులు

కాంట్రాక్టర్‌ను హతమార్చిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యూపీకి చెందిన కాంట్రాక్టర్ ఇంతియాజ్‌ను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఇరపల్లి గ్రామంలో ఇంతియాజ్ రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. అయితే, రహదారి పనులు నిలిపివేయాలని మావోయిస్టులు అతడికి వార్నింగ్ ఇచ్చారు. అయినా పట్టించుకోకుండా పనులు చేపడుతుండటంతో అతడిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చారు.