డ్రెయిన్ వద్ద రక్షణ చర్యలు చేపడతాం: గద్దె రామ్మోహన్

కృష్ణా: విజయవాడలోని గంగిరెద్దుల దిబ్బ వద్ద మురుగునీటి కాలువలో పడి చిన్నారి మణికంఠ మృతిచెందిన ఘటనపై తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. సోమవారం ఆయన మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ. 1లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. డ్రెయిన్ వద్ద రక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. CM సహాయ నిధి ద్వారా మరింత సహాయం అందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.