'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం'
ELR: దెందులూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.