రేపు ఆదిలాబాద్ జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు 6న జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా కలెక్టరేట్ చేరుకొని, కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో 'ప్రజాపాలన' అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి.