ఎస్ఎఫ్ఐ నేతల ముందస్తు అరెస్ట్
JN: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నేతలు ‘చలో అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో లింగాల గణపురం మండల ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జగన్‌ను పోలీసులు ఇవాళ ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులకు ఎస్ఎఫ్ఐ నేతలు భయపడరని, న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తాం అన్నారు.