ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు
VKB: బొంరాస్‌పేట PM SHRI జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంఈవో హరిలాల్ గారు, పాఠశాల సిబ్బంధి నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు బి. చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం బోస్ చేసిన పోరాటాన్ని, ఆయన త్యాగాలను విద్యార్థులకు వివరించారు.