హైడ్రాపై ప్రజలకు క్లారిటీ రావాలి: రంగనాథ్

హైడ్రాపై ప్రజలకు క్లారిటీ రావాలి: రంగనాథ్

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. 'హైడ్రాపై ప్రజలకు క్లారిటీ రావాలి. హైడ్రా ఒకటి, రెండేళ్లకు పరిమితం కాదు. వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. CSR పేరుతో చెరువులను ఆక్రమించాలని చూశారు. సాంకేతిక ఆధారాలతో చెరువులకు FTL మార్క్ చేస్తున్నాం. మూసీ అభివృద్ధికి రూ.375 కోట్లు విడుదలయ్యాయి' అని చెప్పారు.