శరత్‌కు ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డు

శరత్‌కు ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డు

హుస్నాబాద్‌కు చెందిన ప్రముఖ పాత్రికేయుడు ఆరె శరత్‌కు ప్రతిష్టాత్మకమైన “ఉత్తమ జర్నలిస్ట్ -దళిత రత్న” అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మంగళవారం ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఆయన్ని పలువురు అభినందించారు.