యూరియా కోసం బారులు తీరిన రైతులు

NRPT: మరికల్ మండల కేంద్రంలో ఆగ్రో రైతు సేవ కేంద్రం, మన గ్రోమోర్ ఫర్టిలైజర్స్ దుకాణాల ముందు యూరియా కోసం రైతన్నలు బారులు తీరారు. కొన్ని రోజులుగా యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. టోకన్‌లో ఉన్న రైతులందరికీ యూరియా పంపిణీ చేస్తామన్నారు.