పెండింగ్ బిల్లులపై సర్పంచ్ బిక్షాటన

HNK: పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ బిక్షాటన చేశాడు. వివరాల్లోకి వెళితే పరకాల నియోజకవర్గం నడికుడ తాజా మాజీ సర్పంచ్ రవీందర్ రావు తాను చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాలేదంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశాడు. గత ప్రభుత్వం బిల్లులు వెంటనే రిలీజ్ చేసేది.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లింపు చేయాలని కోరారు.