VIDEO: బైరెడ్డిపల్లి చెరువుకు హంద్రీనీవా నీరు
CTR: తాను మంత్రిగా ఉన్నప్పుడే హంద్రీనీవా నీరు తీసుకొచ్చానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం బైరెడ్డిపల్లి చెరువు నీటితో నిండడంతో ఆయన జల హారతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.