సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
PLD: సత్తెనపల్లి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 27 మందికి, 9 మంది ఎల్‌ఓసీ లబ్ధిదారులకు రూ.35.97 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. పేదల వైద్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.