నిబంధనల ఉల్లంఘన... 15వేలు జరిమానా
SKLM: పాతపట్నం గ్రామానికి చెందిన బోయన శేఖర్ అనే వ్యక్తి పాత నేరాల నేపథ్యంలో ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉండాలని గతంలో బైండ్ఓవర్ అయ్యారు. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తూ మార్చిలో మళ్లీ అక్రమంగా మద్యం బాటిళ్లు రవాణా చేస్తూ పట్టుబడ్డారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఆయనను మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా రూ.15,000 జరిమానా విధించినట్లు సీఐ కృష్ణారావు తెలిపారు.