బాధితులకు నష్ట పరిహారం అందజేత

VSP: సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి చనిపోయిన చంద్రంపాలెం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పిల్ల ఉమామహేష్, శైలజ కుటుంబీకులకు ఆదివారం ఒక్కొక్కరికి రూ.25లక్షలు చొప్పున నష్టపరిహార చెక్కును జాయింట్ కలెక్టర్, భీమిలి ఎమ్మెల్యే తనయుడు గంటా రవితేజలు అందజేశారు. వారి ఇరువురి ఫోటోలకు పూలమాలవేసి నివాళులర్పించారు.