మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల వెల్లువ

మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల వెల్లువ

SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గౌతు శిరీష వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 122 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ పరిధి కూటమి నేతలు మంగళవారం కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలోని గాంధీ విగ్రహానికి పూలమాల లేసి, బాణసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.