పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
RR: షాబాద్ PS పరిధిలోని పేకాట స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. కుమ్మరిగూడ గ్రామ సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,600 నగదు, బైకులు,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.