మీ సంస్కారం ఇదేనా: రేణూదేశాయ్

మీ సంస్కారం ఇదేనా: రేణూదేశాయ్

ఫేక్ IDలతో తనను అసభ్య పదజాలంతో దూషించేవాళ్ల ఇళ్లకు వెళ్లి మరీ వారిని తమ పేరెంట్స్ ముందు నిలబెడతానని నటి రేణూ దేశాయ్ హెచ్చరించారు. వ్యక్తిగత జీవితం మొదలు తాను మద్దతిచ్చే రాజకీయ పార్టీ వరకు అన్ని విషయాల్లో కలగజేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖం చూపించడానికి కూడా ధైర్యం లేని కొందరు.. మాలలో ఉన్న తనను రేట్ ఎంత అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.