నల్లవాగు ప్రాజెక్ట్‌లో చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే
SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టులో సోమవారం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి చేప పిల్లలను వదిలారు. ప్రతి ఏటా మాదిరిగానే మత్స్య పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ఉచితంగా మూడు రకాల చేప పిల్ల విత్తనాలను మొత్తం 11.14 లక్షలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.