కూలిన రోడ్డు కల్వర్ట్.. ప్రయాణికుల ఆందోళన

అదిలాబాద్ జిల్లాలో హరిహరన్ నగర్ నుండి సుబాష్ నగర్ వరకు వెళ్లే రోడ్డుపై ఒక ప్రధాన కల్వర్ట్ కూలిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంత కారణంగా వాహనాలు, ద్విచక్ర వాహనాలు సురక్షితంగా వెళ్లలేవని స్థానికులు భావిస్తున్నారు. అధికారులు వెంటనే కల్వర్ట్ మరమ్మత్తులు చేపట్టి, భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు.