ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
NTR: జగ్గయ్యపేటలో ఇటీవల కురిసిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్ అండ్ బీ (R&B) రోడ్డుకు సంబంధించి జరుగుతున్న ప్యాచ్ వర్క్ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డు మరమ్మత్తుల నాణ్యత, పనుల ప్రగతి, ప్యాచ్‌లు వేయడంలో అనుసరిస్తున్న ప్రమాణాలను క్షుణ్ణంగా పర్యవేక్షి సూచనలు చేశారు.