తుప్పు పట్టిన సూచి... మరి మార్గం ఎలా..!

GDWL: జోగులమ్మ గద్వాల్ కొత్త బస్టాండ్ సమీపంలోని సుంకులమ్మ అవ్వ గుడి దగ్గర ఉన్న సూచి పై వాల్ పోస్టర్లు ఎక్కువగా అతికించడంతో ఆ సూచి తుప్పు పట్టిందని, అది ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆరోపించారు. ఈ సూచి డ్యాంకు మార్గ నిర్దేశమని పేర్కొన్నారు. స్థానిక మునిసిపాలిటీ అధికారులు స్పందించి ఈ సూచీని మార్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.