ఢిల్లీలో కాలుష్యం.. 'తందూరీ'కి కష్టకాలం

ఢిల్లీలో కాలుష్యం.. 'తందూరీ'కి కష్టకాలం

ఢిల్లీలో కాలుష్యం దెబ్బకు హోటళ్లు, దాబాల్లో.. బొగ్గు, కట్టెల పొయ్యిలపై నిషేధం విధించారు. తందూరీ వంటల కోసం ఇకపై గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ స్టవ్సే వాడాలని సూచించారు. రూల్ బ్రేక్ చేస్తే భారీ జరిమానా తప్పదని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(DPCC) హెచ్చరించింది. ఇప్పటికే లజపత్‌నగర్ వంటి ప్రాంతాల్లో బొగ్గుకు బదులుగా గ్యాస్, ఎలక్ట్రిక్ పొయ్యిలను ఉపయోగించడం ప్రారంభించారు.