జూనియర్ హాకీ వరల్డ్ కప్.. భారత్ బోణీ
చెన్నైలో ప్రారంభమైన హాకీ జూనియర్ వరల్డ్ కప్‌ను భారత్ ఘనంగా మొదలుపెట్టింది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన యువ భారత్ ఆ దిశగా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో చిలీపై 7-0 తేడాతో విజయం సాధించింది. భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ఆరంభంలో కాస్త ప్రతిఘటించడంతో భారత్ గోల్ చేయడానికి ఆలస్యమైంది.