ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు

ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు

TPT: తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి వైర్లు దొంగతనం చేసిన ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి 55 కేసులను ఛేదించారు. మొత్తం 195 ట్రాన్స్‌ఫార్మర్లలో దొంగతనాలు చేసిన ఈ ముఠా వద్ద నుంచి సుమారు 400 కేజీల రాగి వైర్లు, రెండు ఆటోలు, రెండు బైకులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు దొంగలు, ఒక కొనుగోలు దారుడిని అరెస్ట్ చేశారు.