VIDEO: వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై బీఆర్ఎస్ సమావేశం
WGL: వర్ధన్నపేటలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై బిఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం మీడియా సమావేశం నిర్వహించింది. సీనియర్ నేత సిలువేరు కుమారస్వామి యాదవ్, స్థానిక నేతలు గోధుమల మధుసూదన్, కంజర్ల మహేష్ పాల్గొని, ఆసుపత్రిని వర్ధన్నపేటలోనే పేద, బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తరలించే ప్రయత్నం మానుకోవాలని పేర్కొన్నారు.