అనపర్తిలో కోడి కత్తి శ్రీనుకి న్యాయం చేయాలని నిరసన

తూ.గో: కోడి కత్తి శ్రీనుకి న్యాయం చేయాలంటూ అనపర్తిలో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని పార్టీ నాయకులతో కలిసి కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి, జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.