జాతీయ నృత్య పోటీల్లో జ్ఞానసాయి విద్యార్థుల ప్రతిభ
సత్యసాయి: రాజస్థాన్‌లోని ఝుంఝునూలో జరిగిన 16వ జాతీయ డాన్స్ స్పోర్ట్ ఛాంపియన్ షిప్‌లో పెనుకొండ శ్రీ జ్ఞానసాయి విద్యానికేతన్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. సాల్సా జువెనైల్ విభాగంలో నిధి బంగారు పతకం, నిషి వెండి పతకం సాధించి రాష్ట్రానికి కీర్తి తెచ్చారు. విజేతలను, వారికి శిక్షణ ఇచ్చిన మాస్టర్ డా.మనోహర్‌ను మంత్రి సవిత శనివారం ప్రత్యేకంగా అభినందించారు.