దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలి: మంత్రి నాదెండ్ల

దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలి: మంత్రి నాదెండ్ల

GNTR: తెనాలి పట్టణంలో ఎంతో వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఆదివారం రాత్రి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, శివాజీ చౌక్ లోని శ్రీ కాళీమాత ఆలయం, డాంగేవారి వీధిలోని అమ్మవారి విగ్రహాలను దర్శించుకుని పూజలు చేశారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.