ఈనెల 17 నుంచి పలు సేవా కార్యక్రమాలు: గనిశెట్టి

కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం సేవా పక్వాడ్-2025 మండల సమావేశం మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల 17వ తేదీన దేశ ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.