తూకంలో మోసం.. కేసు నమోదు
PDPL: రామగుండం మండలం గోదావరిఖనిలోని రేషన్ షాపులో వినియోగదారులకు తూకంలో మోసం చేస్తూ తక్కువ బియ్యం పంపిణీ చేసిన డీలర్‌పై జిల్లా కొలతల శాఖ అధికారి ఠాకూర్ రఘువీర్ సింగ్ కేసు నమోదు చేశారు. రేషన్ షాపులోని తూకం వేసే కాంటా వివరాలను పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ రేషన్ షాపులలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.