‘రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి’
KRNL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు గన్ని రాజు పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు(M) కలుగొట్ల చావిడి వద్ద సభ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమస్త ప్రజానీకం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.