ఒక్క స్కాన్ 300కు పైగా సేవలు

ఒక్క స్కాన్ 300కు పైగా సేవలు

VZM: బొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా మంగళవారం వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్టాండ్ ను తహసీల్దార్ రాజేశ్వరరావు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల చేతిలో ప్రభుత్వం అనే నినాదంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్క స్కాన్ ద్వారా 300కు పైగా సేవలకు మొబైల్ ద్వారా దరఖాస్తు చేయవచ్చని చెప్పారు.