రేపు నల్గొండకు మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ రాక

NLG: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ డాక్టర్ షమీమ్ ఆక్తర్ శుక్రవారం నల్గొండకు రానున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరి 10 గంటలకు నల్గొండలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 11:30 గంటలకు జిల్లా జైలు ఖానాను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో భోజనం చేసి రాత్రి 7 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.