గ్యాస్ సెగ.. చిరు వ్యాపారాలు విలవిల..!
W.G: అంతర్జాతీయ యుద్ధ ప్రభావం స్థానిక చిరు వ్యాపారుల పొట్టకొడుతోంది. వంట గ్యాస్ కొరతతో గత కొద్దిరోజులుగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ లభించక, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనలేక మరికొందరు పొయ్యి వెలిగించలేక తణుకులో దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దీంతో వందలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది.