'తెలుగువారికి ఆపదంటే నారా లోకేష్‌ ముందుంటారు'

'తెలుగువారికి ఆపదంటే నారా లోకేష్‌ ముందుంటారు'

NLR: తెలుగు ప్రజలు ఎక్కడ ఆపదలో చిక్కుకున్నా రక్షించేందుకు మంత్రి నారా లోకేష్ ముందుంటారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి, మంత్రి నారా లోకేష్‌కు ఆమె గురువారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.