తాగునీరు రాక ప్రజల అవస్థలు

NZB: కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం మిషన్ భగీరథ నీళ్లు రాక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బిందెలు, బకెట్లతో పడిగాపులు కాశారు. మిషన్ భగీరథ ట్యాంక్ పక్కనే ఉన్నా తమకు ఈ దుస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు చేసేదేమీ లేక వీధి కులాయికి వచ్చే నీటిని స్థానికులు పట్టుకెళ్లారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు.