'విదేశీ ఉపాధికి మైనారిటీ యువత దరఖాస్తు చేసుకోవాలి'
SRPT: మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈరోజు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నరసింహులు తెలిపారు. టామ్‌కామ్ ద్వారా ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో పలు ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. అర్హులు తమ ధ్రువీకరణ పత్రాలతో ఐడీఓసీలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.