VIDEO: జనసేన సమావేశానికి ఏర్పాట్లు

VSP: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 30న విశాఖపట్నంలో నిర్వహించనున్న విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను జగదాంబ జంక్షన్ వద్ద ఆ పార్టీ నేతలు శనివారం ఆవిష్కరించారు. ఈనెల 30న సాయంత్రం 4 గంటలకు ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం నందు సభ జరగనుందనీ ఆ పార్టీ నేత రేసు గౌడ్ తెలిపారు.