VIDEO: స్కానింగ్ సెంటర్కు తాళం.. రోగులు పడిగాపులు
NGKL: జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉదయం 11 గంటలు దాటినా స్కానింగ్ సెంటర్కు తాళం వేసి ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసరంగా స్కానింగ్ కోసం వచ్చిన పలువురు గంటల తరబడి బయట పడిగాపులు కాయాల్సి వచ్చింది. బాధ్యులు సమయానికి డ్యూటీకి హాజరు కాకపోవడం పట్ల ప్రజలు ఆక్షేపించారు. ఆసుపత్రి నిర్వహణ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.