VIDEO: మాజీ మంత్రి జోగి రమేష్‌ను అడ్డుకున్న పోలీసులు

NTR: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు సోమవారం మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం బూడిద వివాదంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించే క్రమంలో ఇంటి నుంచి బయలుదేరిన జోగి రమేష్‌ను ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బూడిద రవాణా కాంట్రాక్టర్ రద్దు చేయాలని, స్థానికులకు ప్రయారిటీ కల్పించాలని ఆయన కోరారు.