వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం వేడుక కనుల పండుగ గురువారం నిర్వహించారు. ఉదయం మూలవరులకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం, ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. ఈ వేడుకను దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.