క్రీడల నిర్వహణకు 4.20 లక్షల నిధులు

క్రీడల నిర్వహణకు 4.20 లక్షల నిధులు

SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు అన్ని మండలాల్లో జరిగే మండల స్థాయి క్రీడల కోసం 4.20 లక్షల నిధులు కేటాయించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఒక్క మండలానికి 15 వేల రూపాయలు చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. మండల స్థాయిలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించాలని చెప్పారు.