దాడులు.. భారత ఎంబసీ కీలక నిర్ణయం
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక రాయబార కార్యాలయం కీలక చర్యలు తీసుకుంది. అనేక మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. విద్యార్థుల రవాణా, ఆహారం, వసతి ఏర్పాట్లను చూసుకున్నామని తెలిపింది.