ఎన్నికల ఖర్చుల పరిశీలకుడిని కలిసిన కలెక్టర్

ADB: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల ఖర్చుల పరిశీలకులుగా నియమితులైన సమీర్ నైరంతర్యను ఎన్టీపీసీలోని అతిథి గృహంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేయనున్న ఖర్చుల వివరాలను పర్యవేక్షించనున్నారు.