ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ

ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ

బాపట్ల: తాళ్లూరు మండలం శివరాంపురంలో ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ నిమిత్తం చీరాల డీఎస్పీ ప్రసాద్ పర్యటించారు. గ్రామానికి చెందిన విమలమ్మ, వెంకటేశ్వర్లు దంపతులు.. మోదేపల్లిలో మొక్కజొన్న పంటను సాగుచేస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ పంటను ట్రాక్టర్తో ధ్వంసం చేసి కులం పేరుతో దూషించారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.