వాహనదారులకు అలర్ట్.. పెరగనున్న ఫాస్టాగ్ ధరలు

వాహనదారులకు అలర్ట్.. పెరగనున్న ఫాస్టాగ్ ధరలు

ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెరగనున్నాయి. NHAI నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న రూ.3,000 ధర, 2.5% పెరిగి రూ.3,075 కానుంది. ఈ పాస్ ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఏడాది కాలపరిమితి లేదా గరిష్టంగా 200 టోల్ ప్లాజాల వరకు ఇది చెల్లుతుంది. అదనపు భారం తప్పించుకోవాలంటే మార్చి 31 లోపు పాత ధరకే రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.