గోకవరం గిరిజన బాలికల వసతి గృహం వార్డెన్ బదిలీ

గోకవరం గిరిజన బాలికల వసతి గృహం వార్డెన్ బదిలీ

E.G: గోకవరం మేజర్ గ్రామ పంచాయతీలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం వార్డెన్‌గా పనిచేస్తున్న జల్లి శంభుడు ప్రమోషన్‌పై బదిలీ అయ్యారు. ఆయన ఏజెన్సీలోని రంపచోడవరం మండలం అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా నియమితులైనట్లు శుక్రవారం తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా గోకవరం వార్డెన్‌గా పనిచేసి విద్యార్థులకు ఆయన అనేక సేవలు అందించారు.