VIDEO: ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాజాబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల అందుబాటు వంటి అంశాలను వారు సమీక్షించారు. నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సేవలను, మిషనరీ విధానంను క్షుణ్ణంగా పరిశీలించారు.