నాటు సారా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

బాపట్ల: చీరాల ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం చీరాల పట్టణంలో విస్తృతంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు అక్రమంగా సారా విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దండుబాట జాలమ్మ గుడి వద్ద ఒకరిని, ఆదినారాయణపురంలో ఒకరిని అరెస్ట్ చేసి 14లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.