ట్రిపుల్ ఐటీ స్పెషల్ కేటగిరీ వారికి అలర్ట్

ELR: ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న స్పెషల్ కేటగిరి (క్రీడలు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, భారత్ స్కౌట్స్) విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు సూచనలు చేశారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు.